సూపర్ స్టార్ రజినీకాంత్ కు "కాంతార" సినిమా చాలా బాగా నచ్చినట్టుంది. అందుకే ముందుగా కాంతార హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టిని పర్సనల్ గా తన ఇంటికి ఆహ్వానించి, శాలువా కప్పి సత్కరించారు. లేటెస్ట్ గా రిషబ్ శెట్టికి రజినీకాంత్ బంగారు గొలుసును ప్రధానం చేసినట్టు తెలుస్తుంది. అంతేకాక, కాంతార లాంటి సినిమా యాభై ఏళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన సినిమా లాంటిది అని పేర్కొన్నారు.
రిషబ్ శెట్టి డైరెక్షన్లో కర్ణాటక రీజినల్ ఆచార వ్యవహారాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమాలో ఆయనే హీరోగా నటించారు. సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది.