తలపతి విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం "వారిసు" నుండి రీసెంట్గా ఫస్ట్ లిరికల్ సాంగ్ "రంజితమే" విడుదలై, చార్ట్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా రంజితమే పాట యూట్యూబులో 50 మిలియన్ వ్యూస్ మార్క్ ను అందుకుని, #3 పొజిషన్ లో దూసుకుపోతుంది. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ ఈ పాటను స్వరపరచగా, తలపతి విజయ్, మానసి కలిసి ఆలపించారు.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.