సూపర్ స్టార్ కృష్ణ గారి మృతిపట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిన్న నానక్ రామ్ గూడాలోని కృష్ణ స్వగృహంలో కృష్ణ గారి పార్థివ దేహానికి కొంతమంది ప్రముఖులు నివాళులర్పించారు. కృష్ణగారి పార్ధివదేహాన్ని ఈరోజు పద్మాలయ స్టూడియోస్ కి తరలించడంతో అక్కడికి మరికొందరు ప్రముఖులు, అభిమానులు వచ్చి నివాళులు సమర్పిస్తున్నారు.
కొంతసేపటి క్రితమే నటసింహం నందమూరి బాలకృష్ణగారు కృష్ణగారికి నివాళులర్పించారు. మహేష్ అండ్ ఫ్యామిలీ ని కలిసి పరామర్శించారు. బాలకృష్ణగారితో పాటు ఆయన సతీమణి వసుంధర, కూతురు బ్రాహ్మణి కూడా రావడం జరిగింది. వారు కూడా కృష్ణగారి భౌతికకాయానికి నివాళి అర్పించారు.