సూపర్ స్టార్ కృష్ణను తలుచుకుంటా కూతురు మంజుల భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఉదయం 11 గంటలకు మన ఫోన్ సంభాషణలు, మధ్యాహ్న భోజనాలు ఇక ఉండవంటే చాలా కోల్పోయినట్లుంది. అందరికీ ఎలాగో మాకూ నువ్వో సూపర్ స్టార్‌వి. కానీ, ఇంట్లో నువ్వొక ప్రేమపూర్వక నాన్నవు. ఎంత ఒత్తిడి ఉన్నా, మాకు సమయం ఇచ్చావు. మాకేం అవసరమో గుర్తించి సమకూర్చావు. నీ వారసత్వం, సినీ రంగానికి చేసిన సేవ చిరస్థాయిగా నిలిచిపోతాయి నాన్న అంటూ పోస్ట్ చేశారు.