తెలుగు తెరపై మరో ముంబై భామ అరంగేట్రం చేస్తుంది. పలు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచిన మానుషి చిల్లర్, సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ భామ తెలుగు సినిమాను అంగీకరించినట్లుగా సమాచాకం. వరుణ్ తేజ్ హీరోగా 13 వ సినిమా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో పట్టాలెక్కనుంది. ఈ చిత్రంతోనే మానుషి చిల్లర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.