సూపర్ స్టార్ కృష్ణ గారు 79 ఏళ్ళ వృద్ధాప్యంలో, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో నిన్న ఉదయం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దీంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది మహేష్ బాబు ఫ్యామిలీ మరియు తెలుగు చిత్రపరిశ్రమ. కృష్ణగారిని కడసారి చూసి, ఘననివాళులు అర్పించేందుకు సినీరాజకీయ ప్రముఖులు, అభిమానులు పద్మాలయ స్టూడియోస్ కు పోటెత్తారు. ఈ సందర్భంగా తాతయ్యకు కడసారిగా కన్నీటి వీడ్కోలు పలుకుతూ ఘననివాళి సమర్పించారు గౌతమ్, సితార.