సమంత నటించిన పాన్ ఇండియా సినిమా "యశోద". నవంబర్ 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల విశేష ఆదరణ చూరగొంటూ, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లను రాబడుతుంది. ఓవర్సీస్ లో కూడా యశోద చాలామంచి కలెక్షన్లను నమోదు చేస్తుంది.
తాజాగా ఈ సినిమా నుండి సీమంతం పాట (బేబీ షవర్ సాంగ్ ) విడుదల కావడానికి రెడీ అయ్యింది. రేపు ఉదయం 11:11 నిమిషాలకు ఈ పాట విడుదల కాబోతుంది.
హరి శంకర్, హరీష్ నారాయణ్ సంయుక్తంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, సంపత్ రాజ్, రావురమేష్ ముఖ్యపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa