మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా పెళ్లి చేసుకోబోతుందని, వరుడు ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త అని, తల్లితండ్రులు ముప్పై దాటిపోయాయి.. పెళ్లిచేసుకోమని తమన్నాను పోరు పెడుతున్నారని.. వగైరా వార్తలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి.
లేటెస్ట్ గా తమన్నా తన వివాహంపై వస్తున్న వార్తలను పుకార్లని పేర్కొంటూ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేసింది. ఎఫ్ 3 లో మగవేషం ధరించినప్పుడు చేసిన రీల్ ను పోస్ట్ చేసి... ఇంట్రడ్యూసింగ్ మై బిజినెస్ మాన్ హస్బెండ్ అని కామెంట్ చేసింది. అలానే లాఫింగ్ ఎమోజీలను కూడా పెట్టింది. ఈ పోస్ట్ కు మ్యారేజ్ రుమర్స్, ఎవ్రీ వన్ స్క్రిప్టింగ్ మై లైఫ్ అనే హ్యాష్ ట్యాగ్ లను జత చేసింది. దీంతో ఇప్పుడప్పుడే తాను పెళ్లి చేసుకోబోవట్లేదని కుండ బద్దలు కొట్టినట్టు సమాధానం చెప్పింది తమన్నా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa