ట్రెండింగ్
Epaper    English    தமிழ்

HHVM : మాస్సివ్ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ.. !!

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 17, 2022, 11:22 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్న విషయం తెలిసిందే. క్రిష్ డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్గా నటిస్తున్నారు.


తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఇంటర్వెల్ బ్లాక్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందట. హై ఇంటెన్స్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండే ఈ సీక్వెన్స్ లో పవర్ స్టార్ ఫుల్ గడ్డంతో నటిస్తున్నారు. వారం రోజుల పాటు ఇంటర్వెల్ సన్నివేశాల చిత్రీకరణ జరగనుందట. పోతే, ఇప్పటివరకు ఈ సినిమా సగభాగం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa