ప్రముఖ బెంగాలీ నటి ఆండ్రిలా శర్మ పరిస్థితి విషమంగా ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ తో నవంబర్ 1న ఆమె ఆస్పత్రిలో చేరింది. బుధవారం పలుమార్లు గుండెపోటు రావడంతో వైద్యులు సీపీఆర్ చేసి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఆమె ఉంది. సర్జరీ చేసేందుకు ఆమె శరీరం సహకరించడం లేదు. దీంతో మందులతోనే ఆమె చికిత్స కొనసాగిస్తున్నారు. ఆమె పరిస్థితి అత్యంత విషమమని వైద్యులు తెలిపారు.