వేణువై వచ్చాను భువనానికి.. గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి.. గాలినై పోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం.. వాంఛలన్నీ వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి.. గాలినై పోతాను గగనానికి
మాతృదేవోభవ .. మాతృదేవోభవ
పితృదేవోభవ .. పితృదేవోభవ
ఆచార్యదేవోభవ … ఆచార్యదేవోభవ
ఏడుకొండలకైన బండతానొక్కటే .. ఏడు జన్మలతీపి ఈ బంధమే
ఏడుకొండలకైన బండతానొక్కటే .. ఏడు జన్మలతీపి ఈ బంధమే
నీ కంటిలో నలక లో వెలుగునీ కనక నేను నేననుకుంటె ఎద చీకటీ
హరీ ……. హరీ ……. హరీ …..ఈఈఈఈఈఈఈఈ
రాయినై ఉన్నాను ఈనాటికీ .. రామపాదము రాక ఏనాటికీ …
వేణువై వచ్చాను భువనానికి … గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి … గాలినై పోతాను గగనానికి
నీరు కన్నీరాయె ఊపిరే బరువాయె నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
నీరు కన్నీరాయె ఊపిరే బరువాయె నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శూన్య బంధాలు పుట్టిల్లు చేరే మట్టిప్రాణాలు
హరీ.. హరీ.. అల్లాహు అక్బరల్లాహు అక్బర్.. హరీ
తేజస్వినావధీనమస్తుమావిద్విషామహై ఓం శాంతి శాంతి శాంతిః
రెప్పనై ఉన్నాను మీ కంటికీ.. పాపనై వస్తాను మీ ఇంటికీ
వేణువై వచ్చాను భువనానికి … గాలినై పోయాను గగనానికి..
గాలినై పోయాను గగనానికీ