యంగ్ హీరో విశ్వక్ సేన్, నివేదా పేతురేజ్ జంటగా నటిస్తున్న చిత్రం "దాస్ కా ధమ్కీ". గతంలో ఇదే కాంబోలో వచ్చిన 'పాగల్' డీసెంట్ హిట్ అయ్యింది. వణ్మయి క్రియేషన్స్ బ్యానర్ లో ఫస్ట్ ప్రాజెక్ట్ గా నిర్మింపబడుతున్న ఈ సినిమాకు విశ్వక్ సేన్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
విశేషమేంటంటే, చడీ చప్పుడు లేకుండా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఇందులో విశ్వక్ తన మార్క్ స్టైలిష్ & ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. మరొక విశేషమేంటంటే, ఈ సినిమాను విశ్వక్ సేనే డైరెక్ట్ చేస్తున్నారు.
ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కాబోతుంది.