నాచురల్ స్టార్ నాని సమర్పణలో రాబోతున్న వెబ్ ఫిలిం "మీట్ క్యూట్". ఈ సినిమాను నాని సిస్టర్ దీప్తి డైరెక్ట్ చెయ్యడం విశేషం. రీసెంట్గా రిలీజైన మీట్ క్యూట్ టీజర్ ప్రేక్షకుల హృదయాలను ఎమోషనల్ గా కట్టిపడేసింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. పోతే, మరొక 24 గంటలలోపు ట్రైలర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసినట్టు అధికారిక ప్రకటన విడుదల చేసారు.
సత్యరాజ్, రోహిణి, వర్ష బొల్లమ్మ, అదా శర్మ, రుహని శర్మ, ఆకాంక్ష సింగ్, సునయన తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఐదు మోడరన్ అర్బన్ లవ్ స్టోరీల అంథాలజీ చిత్రంగా తెరకెక్కింది.
ఐతే, ఈ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అవుతుంది. త్వరలోనే సోనీ లివ్ ఓటిటిలో మీట్ క్యూట్ ఆడియన్స్ ను పలకరించనుంది.