కన్నడ బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ హిట్ మూవీ "కాంతార" మిగిలిన భాషల్లో కూడా ఘనవిజయం సాధించింది. ఎన్ని కొత్త సినిమాలు విడుదలవుతున్నా బాక్సాఫీస్ వద్ద కాంతార కలెక్షన్ల హవా ఏ మాత్రం తగ్గట్లేదు. ఈ కారణంగానే మేకర్స్ కాంతార డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారని వినికిడి.
ఐతే, తాజాగా కాంతార డిజిటల్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 24 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటిలో కాంతార డిజిటల్ ప్రీమియర్ కి రానుందని అధికారిక సమాచారం.
కన్నడ నటుడు రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాధ్ సంగీతం అందించారు.