మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో RC 15 పాన్ ఇండియా సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ను న్యూజిలాండ్ లో స్టార్ట్ చేయనుంది. ఈ మేరకు చెర్రీ RC 15నెక్స్ట్ షెడ్యూల్ కోసం సర్వం సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంటూ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేసారు. ఈ వీడియోలో రాంచరణ్ మరికొంతమందితో కలిసి ఫుట్ బాల్ ఆడుతూ కనిపిస్తారు. అలానే క్లిష్టతర వర్కౌట్స్ చేస్తూ కూడా కనిపిస్తారు. ఈ వీడియోకు చెర్రీ నో వెకేషన్ ఫర్ వర్కౌట్స్ అని కామెంట్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.