తమిళ్ లో ఇటీవల విడుదలై హిట్ అయిన 'లవ్ టుడే' సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ను గురువారం విజయ్ దేవరకొండ విడుదల చేశాడు. సినీ ప్రియులను ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ప్రదీప్ రంగనాథన్ తెరకెక్కించిన ఈ ఈ సినిమాలో సత్యరాజ్, యోగిబాబు తదితరులు నటించారు. ప్రదీప్ రంగనాథన్, ఇవానా, రవీనా రవి ప్రధాన పాత్రల్లో నటించారు.