రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ యాక్షన్ డ్రామా 'కాంతారా' తెలుగు డబ్బింగ్ వెర్షన్ అక్టోబర్ 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో తెలుగురాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ 25 కోట్ల షేర్ వసూలు చేయడంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేసిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 4.5 కోట్లకు అమ్ముడయినట్లు సమాచారం. యూఎస్ఏలో కూడా తెలుగు వెర్షన్ దాదాపు 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ యాక్షన్-థ్రిల్లర్ సినిమాలో ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్ మరియు నవీన్ డి పాడిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.