హీరో ఐఫోన్ పోవడం, పోలీసులే దానిని కాజేశారని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి వెళ్లడం, ఎవరో కావాలనే ఒక నేరంలోకి హీరోని నెట్టడం... వీటన్నిటి నేపథ్యంలో నడిచే డ్రామా, హ్యూమర్, యాక్షన్ తో నేను స్టూడెంట్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తుంది. దీంతో యూట్యూబులో ఈ టీజర్ 1.6 మిలియన్, 21కే లైక్స్ తో దూసుకుపోతుంది.
బెల్లంకొండ గణేష్ నుండి రాబోతున్న రెండో చిత్రమిది. రాఖీ ఉప్పలపాటి డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు అవంతికా దస్సనీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంతోనే అవంతికా టాలీవుడ్ డిబట్ చేస్తుంది. మహతీ స్వరసాగర్ సంగీతం అందించారు.
![]() |
![]() |