బాలీవుడ్ నటీనటులు వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం "భేడియా". అమర్ కౌశిక్ డైరెక్షన్లో ఇండియాస్ ఫస్ట్ ఎవర్ క్రియేచర్ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 25వ తేదీన హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుంది.
తెలుగులో ఈ చిత్రాన్ని అల్లుఅరవింద్ గారు సమర్పిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో భేడియా టీం ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ మేరకు తెలుగులో కూడా ముమ్మర ప్రచార కార్యక్రమాలను చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 19న అంటే ఎల్లుండి ఉదయం తొమ్మిదింటి నుండి హైదరాబాద్ లోని వెస్టిన్ లో తోడేలు ప్రెస్ మీట్ జరగనుంది. ఈమేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.
![]() |
![]() |