థియేటర్లలో, ఓటిటిలో ప్రత్యేక గుర్తింపును, విజయాన్ని సొంతం చేసుకున్న "సీతారామం" సినిమా తాజాగా బుల్లితెరపై సత్తా చాటేందుకు రెడీ అవుతుంది. ఈ మేరకు ఈ ఆదివారం సాయంత్రం ఐదున్నరకు స్టార్ మా ఛానెల్ లో సీతారామం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానుంది.
హను రాఘవపూడి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా వ్యాప్తంగా చాలా మంచి రివ్యూలను అందుకుంటూ ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మండన్నా కీలకపాత్రలో నటించింది. సుమంత్, భూమిక, తరుణ్ భాస్కర్, మురళీశర్మ, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్యపాత్రలు పోషించారు.
![]() |
![]() |