జూనియర్ ఎన్టీఆర్ శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ "బాద్షా". ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, ప్రస్తుతం వెర్సటైల్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న రీతూవర్మ ఈ సినిమాతోనే నటిగా కెరీర్ ను స్టార్ట్ చేసింది. 2013లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. తమన్ అందించిన మ్యూజిక్ ఆల్బం చార్ట్ బస్టర్ గా నిలిచింది.
లేటెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీకొచ్చి 22 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా బాద్షా సినిమాను ఈ నెల 19న మరోసారి థియేటర్లకు తీసుకొచ్చేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ ఈ సినిమాను నిర్మించారు.