బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ తో నిర్మిస్తున్న చిత్రం "తునివు". ఇందులో మంజు వారియర్, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. వలిమై ఫేమ్ హెచ్ వినోద్ డైరెక్షన్లో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి మీడియాలో హల్చల్ చేస్తుంది.
అదేంటంటే, తునివు ఓవర్సీస్ రైట్స్ కళ్లుచెదిరే మొత్తానికి అమ్ముడయ్యాయని టాక్. ఒక్క సింగపూర్ మినహాయిస్తే, తునివు ఓవర్సీస్ రైట్స్ ను 11 కోట్లకు లైకా ప్రొడక్షన్స్ సంస్థ కొనుగోలు చేసిందట. ఇక, సింగపూర్ రైట్స్ ను కూడా కలుపుకుంటే తునివు ఓవర్ సీస్ రైట్స్ మొత్తంగా పదమూడు కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం.
పోతే, వచ్చే ఏడాది పొంగల్ కి ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.
![]() |
![]() |