టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో రానున్న సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో రూపొందనుందని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ హిందీ నటీనటులు నటిస్తున్నారు అని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకరాం, బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో కీలక పాత్రకు ఎంపిక అయ్యినట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ మూవీ మేకర్స్ నుండి ఇంకా వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహారెడ్డి' సినిమాతో బిజీగా ఉన్నారు.
![]() |
![]() |