అల్లరి నరేష్, ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం". నవంబర్ 25వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి 'కోలో కోలో కోయిలా' అనే పాట విడుదల కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. నవంబర్ 19 వతేది ఉదయం పదింటికి ఈ పాట విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. మారేడుమిల్లి గ్రామంలో జరిగే ఉత్సవం నేపథ్యంలో వచ్చే ఈ పాట ఫుల్ జోష్ తో కలర్ఫుల్ గా ఉండేటట్టు కనిపిస్తుంది.
హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని ఏఆర్ మోహన్ డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.