కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హిందీలో 'మిషన్ మజ్ను' అనే స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజా అప్డేట్ ప్రకారం, 'మిషన్ మజ్ను' సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్ OTT విడుదల కానుంది అని సమాచారం. ఈ చిత్రం జనవరి 18, 2023న ప్రసారం కానుంది.
మిషన్ మజ్ను షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. యాడ్ ఫిల్మ్ మేకర్ శంతను బాగ్చి ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, బాలీవుడ్ అగ్ర నిర్మాత రోనీ స్క్రూవాలా అమర్ బుటాలా మరియు గరిమా మెహతాతో కలిసి నిర్మిస్తున్నారు.