కోలీవుడ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ డైరెక్ట్ చేసి, తొలిసారిగా హీరోగా నటించిన చిత్రం "లవ్ టుడే". రీసెంట్గా తమిళనాడులో రిలీజైన ఈ సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే కలెక్షన్లను రాబడుతూ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. పోతే, తెలుగులో అదే టైటిల్ తో ఈ నెల్లోనే విడుదల కావడానికి సిద్దమవుతుంది. దిల్ రాజు ఈ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
ఈ రోజే లవ్ టుడే తెలుగు ట్రైలర్ విడుదల కాగా, ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ నేపథ్యంలో రేపు ఈ సినిమా తెలుగు ఆడియో లాంచ్ ఈవెంట్ జరగబోతుంది. రేపు సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్ లోని దసపల్లా కన్వెన్షన్ సెకండ్ ఫ్లోర్ లో లవ్ టుడే తెలుగు ఆడియో లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa