యష్ పూరి హీరోగా పరిచయమవుతున్న చిత్రం "చెప్పాలని ఉంది". ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై 94వ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాను అరుణ్ భారతి డైరెక్ట్ చేస్తున్నారు. అస్లాం కెయి సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి లేరా లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. హీరో తన ఫ్రెండ్స్ తో కలిసి మందు సిట్టింగ్ పెట్టినప్పుడు వచ్చే పాటిది. ఈ పాటను శ్రీకృష్ణ, అస్లాం కెయి ఆలపించగా, విజయ్ కుమార్ లిరిక్స్ అందించారు.
స్టెఫీ పటేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సత్య తనికెళ్ళ భరణి, సునీల్, పృథ్విరాజ్, రఘుబాబు, అలీ ముఖ్యపాత్రలు పోషించారు. రీసెంట్గా రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే విధంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa