మెగాస్టార్ చిరంజీవి గారినుండి వచ్చిన కొత్త చిత్రం "గాడ్ ఫాదర్". మోహన్ రాజా డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందింది. ఈ సినిమాలో కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్, మురళీశర్మ, సునీల్, షఫీ, అనసూయ, పూరి జగన్నాధ్ కీలకపాత్రలు పోషించారు.
థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా అలరించిన గాడ్ ఫాదర్ మరికొన్ని గంటల్లోనే డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు అర్ధరాత్రి నుండి నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో గాడ్ ఫాదర్ డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో చిరుతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa