తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన కొత్త ప్రాజెక్ట్‌ను నెల్సన్ దిలీప్ కుమార్ తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ మరో ప్రధాన పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రజినీకాంత్ కి జోడిగా ఐశ్వర్యరాయ్ నటిస్తుంది. ఈ చిత్రానికి 'జైలర్' అనే టైటిల్ నిమూవీ మేకర్స్ లాక్ చేసారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న జైలర్ రిలీజ్ డేట్ గురించి చర్చ జరుగుతోంది.
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం ఏప్రిల్ 14, 2023న థియేట్రికల్ విడుదల కానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాలో తమన్నా భాటియా, రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానిని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa