ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ పూర్తి చేసుకున్న "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం"

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 18, 2022, 05:51 PM

AR మోహన్ డైరెక్షన్లో డిఫరెంట్ యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం". ఇందులో అల్లరి నరేష్, ఆనంది జంటగా నటించారు. నవంబర్ 25న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ చిత్రానికి యూ/ ఏ సెర్టిఫికెట్ ఇచ్చింది.


ఇందులో నరేష్ ఎలక్షన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. మారేడుమిల్లి ఐడెంటిటీ కోసం ఒంటిచేత్తో ప్రభుత్వం పై దండెత్తిన ఒక ఎలక్షన్స్ ఆఫీసర్ పోరాటమే ఈ చిత్రం. వెన్నెల కిషోర్, ప్రవీణ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa