గత కొంతకాంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు లోక్‌నాథ్ (91) మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం బెంగళూరులో తుదిశ్వాస విడిచిన ఆయన భౌతిక కాయాన్ని అభిమాను, సన్నిహితు సందర్శనార్థం రవీంద కళాక్షేత్రంలో ఉంచారు. 650కిపైగా సినిమాల్లో నటించిన లోక్‌నాథ్ వెయ్యి నాటకాల్లోనూ నటించారు. 1970లో సంస్కార అనే సినిమాతో కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయనను ఉప్పినకాయి అని ఆప్యాయంగా పిలుస్తారు. 2016లో నటించిన రే ఆయన చివరి సినిమా. లోక్‌నాథ్ మృాతికి శాండల్‌వుడ్ నటులు సంతాపం తెలిపారు. కాగా, లోక్‌నాథ్ ఇటీవ లఅంబరీష్ అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు. ఆయనకు ఓ కుమారుడు, నుగురు కుమార్తె ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa