ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీలోకి నేనా? పొలిటికల్ ఎంట్రీ పై అక్కినేని అమల కామెంట్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 02, 2019, 02:24 AM

ఏపీ రాజకీయాల్లో ఎన్నికలు దగ్గర పడుతుంటే రోజుకో వార్త బయటకు వస్తుంది. ఇక ఈసారి ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకం కానున్న నేపధ్యంలో సరికొత్త పొలిటికల్ పిక్చర్ కనిపించనుంది. ఇక సినీ ఇమేజ్ ను పార్టీలు సాధ్యమైనంత మేర వాడుకోవాలని చూస్తున్నారు. ఇక అంతే కాదు స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తా అంటే కూడా రండి టికెట్ ఇస్తాం అని ఆహ్వానిస్తున్నారు. ఈసారి వైసీపీ, టీడీపీ నుంచి సినిమా ఇండస్ట్రీ నుండి పలువురు రంగంలోకి దిగుతున్నారు . ఇక వైసీపీకి ఇటీవల సినిమా స్టార్స్ తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న మోహన్ బాబు , నిన్న నాగార్జున వై సీపీ కి తమ మద్దతు తెలిపారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎలాగో అక్కినేని ఫ్యామిలీ కూడా అంతే, ఇరువురికి అంతే ప్రాధాన్యత ఉంది. అయితే రాజకీయంగా కూడా ఆనాడు ఎన్టీఆర్ సీనియర్ నటులను పార్టీలోకి రావాలి అని కోరారు.. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వరరావుని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరితే ఆయన తాను రాజకీయాల్లోకి రాను అని చెప్పారు. ఇక ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి నాగార్జున వస్తారా అంటే నిన్నటి దాకా వస్తారు అనే టాక్ వినిపించింది. ఇక జగన్ చేసే బస్ యాత్రలో కూడా నాగర్జున పాల్గొంటారని ప్రచారం జరిగింది. ఇక ఈ నేపధ్యంలోనే ఒక వార్త సోషల్ మీడియా లో హల చల్ చేసింది.ముఖ్యంగా వైసీపీ కి చెందిన వెబ్ ఏడీఆఏఏ వార్తను హై లైట్ చేసింది.
ఇప్పుడు అక్కినేని కుటుంబం వైసీపీకి దగ్గర అవుతోన్న నేపధ్యంలోవిజయవాడ నుండి ఎంపీగా అక్కినేని అమల రంగంలోకి దిగుతారని ప్రచారం జరిగింది. అయితే అది ఎంత వాస్తవమో స్వయంగా వారే చెప్పారు. రాజకీయాల్లో ఎవరి ఇష్టం వారిది ఎవరు ఏ పార్టీలో కలిసినా వారి ఇష్టం. ఇక నాగార్జున వ్యాపారపరంగా ముందు నుంచి కాంగ్రెస్ తో కలిసి మెలిసి ఉండేవారు.. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కువగా నాగార్జునకి స్నేహితులు.. అలాగే వైయస్ తో కూడా సాన్నిహిత్యం ఉండేది. అందుకే వైయస్ కు ఆయన సపోర్ట్ చేశారు.ఇక అదే బాటలో ఆయన జగన్ తో కూడా సాన్నిహిత్యంగా ఉన్నారు. ఇక ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఆయన భార్య అమలని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నట్టు వార్త హల్ చల్ చేస్తోంది.. అసలు ఇందులో వాస్తవం ఎంత ఉంది వైసీపీలో వారు చేరుతారా పోటీ చేస్తారా అంటే ఈ వార్తలు అన్ని పుకార్లు అని, ఆమె అసలు రాజకీయాల్లోకి రాదు అని తెలియచేశారట నాగార్జున..తమకు ప్రత్యక్ష రాజకీయాల మీద ఆసక్తి లేదని వారు చెప్పారట. ఇక అమలను విజయవాడ నుంచి జగన్ ఎంపీగా తన పార్టీ తరపున బరిలోకి దించుతున్నారు అనేది పూర్తి అవాస్తవం అని అంటున్నారు నాగార్జున . ఇక వైసీపీ నేతలు కూడా ఇది ఫేక్ అని చెప్పడం, ఇక్కడ కొసమెరుపు. మరి ఎన్నికల సమయంలో వైసీపీకి అక్కినేని ఫ్యాన్స్ ని మరల్చుకోవడానికి చేస్తున్న ప్రచారం అని అందరికీ అర్ధం అయ్యింది .నాగార్జున మరో రెండు వ్యాపారాలు పెడతారు కాని, రాజకీయాల్లోకి రారు అని చెబుతున్నారు ఆయన అభిమానులు. మొత్తానికి నాగార్జున పొలిటికల్ ఎంట్రీ పై అలాగే అమల పోటీపై ఒక క్లారిటీ వచ్చింది. అక్కినేని ఫ్యామిలీ పొలిటికల్ ఎంట్రీ లేనట్టే అని తేలిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa