ట్రెండింగ్
Epaper    English    தமிழ்

25న ‘మిస్టర్ మజ్ను’!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 02, 2019, 01:45 AM

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ‘ఏమైనదో… ఏమైనదో… పలుకు మరచినట్టు పెదవికేమైనదో..’ పాటకు చాలా మంచి స్పందన వస్తోంది. కాగా బుధవారం సాయంత్రం 6 గంటలకు నూతన సంవత్సరం కానుకగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయనున్నారు. అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతంః తమన్, పాటలుః శ్రీమణి, సినిమాటోగ్రఫీః జార్జ్ సి.విలియమ్స్, ఎడిటింగ్‌ః నవీన్ నూలి, ఆర్ట్‌ః అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీః శేఖర్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa