రీసెంట్గా రిలీజైన సినిమాలలో కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసింది సీతారామం సినిమా. హను రాఘవపూడి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాలో రష్మిక మండన్నా కీలకపాత్రలో నటించింది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి.
థియేటర్లలో, డిజిటల్ స్ట్రీమింగ్లో సత్తా చాటిన సీతారామం సినిమా తాజాగా బుల్లితెరపై సందడి చెయ్యడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు రేపు సాయంత్రం ఐదున్నరకు స్టార్ మా ఛానెల్ లో సీతారామం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రాబోతుంది. మరి, బుల్లితెరపై సీతారాముల ఎపిక్ లవ్ స్టోరీకి ఏపాటి TRP వస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa