టైమ్ వస్తే అంతే.. ఎవ్వడూ ఆపలేదు. ఇప్పుడా టైమ్ ఒకప్పటి ఫ్యామిలీ హీరో - ఇప్పటి విలన్ జగపతిబాబుకి నడుస్తుంది. జగపతిబాబు విలన్ గా చేసిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అవుతుంది. సూపర్ హిట్ అవ్వడమే కాదు.. ఆయనకు స్టైలిష్ విలన్ గా మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఒకప్పడు మన ఇండస్ట్రీలో విలన్ అంటే.. పంచె కట్టుకుని - ఇంత పొట్టేసుకుని ఉండేవాళ్లు. అలాంటి టైమ్ లో క్లాస్ విలన్ గా కోసం బాలీవుడ్ కి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి క్లాస్ విలన్ గా కోసం బాలీవుడ్ వాళ్లే జగపతిబాబు కోసం వస్తున్నారంటే.. మనోడి రేంజ్ అర్థం చేసుకోవచ్చు.
తెలుగులో విలన్ గా దూసుకుపోతున్న జగపతిబాబు తమిళ్ లో కూడా సినిమాలు చేస్తున్నాడు. కానీ హిట్స్ మాత్రం రావడం లేదు. ఐదేళ్ల క్రితం లింగా సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. అది కాస్తా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత జగపతిబాబుకి అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు అజిత్ విశ్వాసం సినిమాతో మరోసారి విలన్ గా తన లక్ టెస్ట్ చేసుకోబోతున్నాడు జగపతి. ట్రైలర్ లో అదరగొట్టేశాడు. జగపతి లుక్స్.. అజిత్ కంటే బ్రహ్మాండంగా ఉన్నాయి. జగపతిబాబుకి తమిళ్ బాగా వచ్చు కాబట్టి.. సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. మనోడ్ని విలన్ గా తీసుకుంటే డబ్బింగ్ ఖర్చులు కూడా మిగిలినట్లే. సో..విశ్వాసం సినిమాతో ఈ సారి అరవోళ్ల విశ్వాసాన్ని జగపతిబాబు సంపాదించేటట్లే కన్పిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa