ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమెడియన్ అలీ మీద పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఆగ్రహం

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 02, 2019, 12:08 PM
పవన్ కళ్యాణ్ మరియు అలీ యొక్క స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆలీ లేకుండా పవన్ సినిమాలను ఊహించుకోలేం. అంతగా వీరిద్దరి మధ్య స్నేహం పెనవేసుకుపోయింది. సమయం దొరికినప్పుడల్లా పవన్‌పై తనకున్న అభిమానాన్ని ఆలీ బహిరంగంగా చెబుతూనే ఉంటారు. పవన్ సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ వారి మధ్య స్నేహం కొనసాగుతూ వచ్చింది. గతంలో హైదరాబాద్‌లో జనసేన పార్టీ ప్రారంభానికి వచ్చిన ఆలీ.. పవన్‌కు ఓ బహుమతి ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పారు. దీంతో ఆలీ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారని, ఆయన స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. దీనిపై పవన్ గానీ, ఆలీ గానీ స్పందించలేదు.

అయితే ఇటీవల ఆలీ శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిశారు. వీరిద్దరూ సుమారు గంటసేపు మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆలీ వైసీపీలో చేరుతున్నారంటూ పుకార్లు వచ్చాయి. ఈ విషయం ఇప్పుడు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది. పవన్‌కు అత్యంత సన్నిహితుడైన ఆలీ.. జగన్‌ను కలవడంపై వారు మండిపడుతున్నారు. ‘పవన్ పక్కనే ఉంటూ ఇంత మోసం చేస్తావా’ అంటూ నిలదీస్తున్నారు. సోషల్‌మీడియాలో ఆలీపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ఆలీ ఎలా స్పందిస్తారో చూడాలి. 





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa