సాయి కిరణ్ దర్శకత్వంలో సంగీత, తిరువీర్ నటించిన 'మసూద' సినిమా విడుదలై సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. మసూదా సినిమా విడుదలైన రోజు నుండి అద్భుతమైన స్టార్ట్ ని మొదలుపెట్టింది. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, ఈ హారర్ చిత్రం టోటల్ గా నైజాం రీజియన్‌లో 3 రోజులలో 1.16 కోట్లు నెట్ (63 లక్షల షేర్) వసూలు చేసింది.
ఈ హర్రర్ డ్రామాలో శుభలేక సుధాకర్, అఖిలా రామ్, కావ్య కళ్యాణ్‌రామ్, బాంధవి శ్రీధర్ మరియు ఇతరులు కీలక పాత్రలో నటించారు. రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు.