తమిళ స్టార్ శివకార్తికేయన్ హీరోగా నటించిన సినిమా 'ప్రిన్స్'. ఈ సినిమాకి అనుదీప్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయినిగా ఉక్రెయిన్ బ్యూటీ మెరీనా ర్యాబోషప్కా నటించింది. ఈ సినిమా అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలయింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటిటి సంస్థ 'డిస్నీ ప్లస్ హాట్‌స్టార్' లో ఈ సినిమా నవంబర్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది.