వచ్చే నెల డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని 'బాబా' సినిమాని గ్రాండ్‌గా రిరిలీజ్ చేయబోతున్నారు.ఈ సినిమాకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మనీషా కొయిరాలా హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి రెహమాన్ సంగీతం అందించారు.2002లో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.