PS మిత్రన్ డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన చిత్రం "సర్దార్". ఇందులో కార్తీ, రాశిఖన్నా జంటగా నటించారు. దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. నవంబర్ 18 నుండి డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన సర్దార్.. అక్కడ కూడా గ్రాండ్ సక్సెస్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆహా తెలుగు, తమిళ్ ఓటిటిలో స్ట్రీమింగ్ కొచ్చిన సర్దార్ నాల్రోజుల్లో 150 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకుపోతుంది.
రజిషా విజయన్, సీనియర్ హీరోయిన్ లైలా కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రంలో కార్తీ ద్విపాత్రాభినయం చేసారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. తెలుగులో ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జునగారు రిలీజ్ చేసారు.