మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ "అవతార్ ది వే ఆఫ్ వాటర్" నుండి కొంతసేపటి క్రితమే బ్రాండ్ న్యూ అండ్ ఫైనల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈసారి ట్రైలర్ లో దిమ్మతిరిగే యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు హృదయాలను కరిగించే ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ ట్రైలర్ యాక్షన్ కం ఎమోషనల్ ట్రైలర్ కట్ గా అభిమానులను ఆకట్టుకుంటుంది.
జేమ్స్ కామెరూన్ డైరెక్షన్లో అద్భుతమైన విజువల్ వండర్ గా రూపొందిన ఈ చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మింపబడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే 2 బిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చెయ్యాలి. 3 గంటల 10 నిమిషాల నిడివితో డిసెంబర్ 16న ఐమ్యాక్స్ 3డి లో విడుదల కాబోతున్న అవతార్ 2 గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అని యావత్ సినీ ప్రపంచం ఆదుర్దాగా ఎదురుచూస్తుంది.