అడివి శేష్ హీరోగా నటిస్తున్న 'హిట్-2' సినిమా ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన హీరో నానితో కలిసి అడివి శేష్ ట్రైలర్ అప్ డేట్ ఇచ్చారు. ఈ నెల 23న ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా డిసెంబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.