తెలుగు సినిమా 'శంకరాభరణం' కు మరో అరుదైన గౌరవం దక్కింది. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో రిస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ సినిమాగా శంకరాభరణం ఎంపికైంది. నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఈ సినిమాను డిజిటలైజ్ చేసి భద్రపరచనుంది. 53వ ఐఎఫ్ఎఫ్ఐలో ప్రత్యేకంగా శంకరాభరణం సినిమాను ప్రదర్శించారు. 1980లో విడుదలైన ఈ సినిమాకు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించగా, ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు. కె.వి.మహదేవన్ సంగీతం అందించారు.