కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం "NC 22''. ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
రేపు చైతు పుట్టినరోజు కావడంతో NC 22 మూవీ టీం అభిమానులకు బిగ్ బర్త్ డే ట్రీట్ ప్లాన్ చేసింది. చైతు పుట్టినరోజు కానుకగా రేపు ఉదయం 10:18 నిమిషాలకు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చెయ్యబోతున్నట్టు తెలుపుతూ, ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ ప్రీ లుక్ పోస్టర్ లో, పోలీసాఫీసర్ వేషంలో ఉన్న చైతు ఇంటెన్స్ అండ్ పవర్ఫుల్ కళ్ళు మాత్రమే కనిపిస్తాయి. చైతూని ఇతర పోలీసాఫీసెర్లే చుట్టుముట్టి అటాక్ చేస్తున్న బ్యాక్ డ్రాప్ లో రిలీజ్ చేసిన ఈ ప్రీ లుక్ పోస్టర్ లో చైతు కళ్ళు మెయిన్ హై లైట్.
కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి, ప్రియమణి, సంపత్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.