వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య"గా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య చిత్రబృందం మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేసి, అభిమానుల్లో ఈ సినిమాపై భారీ హైప్స్ క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు కొంతసేపటి క్రితమే ఫస్ట్ సింగిల్ 'బాస్ పార్టీ' ప్రోమో విడుదలైనది. నువ్..లుంగీ ఎట్కో .. నువ్ .. షర్ట్ ముడేస్కో..బాస్ వస్తుండూబాస్ వస్తుండూ,.. అని రాక్ స్టార్ DSP పాడుతుంటే, అందుకు తగ్గట్టు మెగాస్టార్ తన స్టైల్ లో నడుచుకుంటూ వస్తున్న ఈ ప్రోమో అదిరిపోయింది. పూర్తి పాటపై చాలా మంచి అంచనాలను క్రియేట్ చేసింది. రేపు సాయంత్రం 04:05 నిమిషాలకు బాస్ వస్తుండూ... పూర్తి పాట విడుదల కాబోతుంది.
బాబీ డైరెక్షన్లో కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. శృతి హాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ సింహ విలన్గా నటిస్తున్నారు.