అడవిశేష్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం "హిట్ 2". మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. శైలేష్ కొలను డైరెక్టర్ గా వ్యవహరించారు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.
రీసెంట్గా రిలీజైన టీజర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చెయ్యగా, మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారు. ఈ మేరకు రేపు ఉదయం 11:07 నిమిషాలకు హిట్ 2 ట్రైలర్ రిలీజ్ కాబోతుందని అధికారిక ప్రకటన విడుదలయింది. పోతే, ఈ చిత్రం డిసెంబర్ 2న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.