కన్నడ బ్యూటీ రష్మిక మందన్న 'పుష్ప: ది రైజ్' సినిమా ఘన విజయం తర్వాత నార్త్ లో కూడా ఈ బ్యూటీ కి ఫుల్ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం నేషనల్ క్రష్ బాలీవుడ్ లో మిషన్ మజ్ను అండ్ గుడ్‌బై అనే రెండు సినిమాలలో నటించింది. గుడ్‌బై సినిమాలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి అందరికి తెలిసందే.
తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా డిసెంబర్ 2, 2022న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌కి అందుబాటులోకి రానుంది అని ప్రకటించింది. ఈ చిత్రంలో అమితాబ్ మరియు రష్మిక తండ్రీకూతుళ్లుగా నటించారు. ఈ చిత్రంలో నీనా గుప్తా, పావైల్ గులాటి, సునీల్ గ్రోవర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వికాస్ బహ్ల్, ఏక్తా కపూర్, శోభా కపూర్, విరాజ్ సావంత్ మరియు సరస్వతి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి.తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.