ఒకేఒక జీవితం సినిమాతో చాన్నాళ్ల తరవాత తిరిగి సక్సెస్ బాట పట్టిన హీరో శర్వానంద్ ఇకపై ఆ సక్సెస్ ను కంటిన్యూ చెయ్యాలనే ఉద్దేశంతో ఆచితూచి సినిమా కధలను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శర్వానంద్ తీసుకున్న సంచలన నిర్ణయమొకటి అభిమానులను షాక్ కు గురి చేస్తుంది.
ఒకే ఒక జీవితం సినిమాతో ఫుల్ సక్సెస్ జోష్ లో ఉన్న శర్వా 'హీరో' మూవీ డిజాస్టర్ తో ఘోరపరాజయం పాలైన శ్రీరామ్ ఆదిత్యకి ఛాన్స్ ఇచ్చారని వినికిడి. శ్రీరామ్ చెప్పిన స్క్రిప్ట్ శర్వా కి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక పూజా కార్యక్రమం జరగనుందట. అంతకుముందు శ్రీరామ్ ఆదిత్య భలేమంచి రోజు, శమంతకమణి, దేవదాస్ సినిమాలను డైరెక్ట్ చేసారు.