మెగాపవర్ స్టార్ రాంచరణ్ నుండి 15వ సినిమా రాకముందే...అసలింకా RC 15 షూటింగ్ కూడా ముగియకముందే RC 16 సినిమా గురించిన విషయాలు, విశేషాలు మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముందుగా ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చెయ్యాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఈ కాంబో వర్క్ అవుట్ కాలేదు. అందుకనే, RC 16 పై అంతటా ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన చరణ్ ను కలవడం, కథ వినిపించడం, చెర్రీ ఓకే చేసెయ్యడం అన్ని జరిగిపోయాయి. RC 16 సినిమాకు నూరుశాతం బుచ్చిబాబునే దర్శకత్వం చేస్తారని, వచ్చే ఏడాది సంక్రాంతి అయిపోయిన తరవాత నుండి RC 16 సెట్స్ పైకి వెళ్తుందని, ఒక కొత్త నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని తెలుస్తుంది. విశేషమేంటంటే, క్రీడా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ స్క్రిప్ట్ ఫైనలైజేషన్ విషయంలో బుచ్చిబాబు గురువు, ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ గారు కూడా పాలుపంచుకోవడం.