మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో చేస్తున్న సినిమాకు సంబంధించి ప్రస్తుతం న్యూజిలాండ్ లో తాజా షెడ్యూల్ జరుగుతుంది. నిన్నటి నుండే న్యూజిలాండ్ లో షూటింగ్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో డైరెక్టర్ శంకర్ తన మార్క్ స్టైలిష్ అండ్ అద్భుతమైన విజువల్స్ తో కూడిన ఒక కలర్ఫుల్ సాంగ్ ను షూట్ చెయ్యనున్నారు. భారీ బడ్జెట్ తో చిత్రీకరింపబడుతున్న ఈ పాట శంకర్ ఐకానిక్ సాంగ్స్ లిస్ట్ లోకి చేరడం ఖాయమని అంటున్నారు.
రాంచరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న ఈ చిత్రం లో SJ సూర్య కీరోల్ ప్లే చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.